Flood control caused by heavy rains

అకాల వర్షాల కారణంగా ఎగువ ప్రాంతం నుండి వస్తున్న నీటి వరదల కారణంగా కరీంనగర్ – సిరిసిల్ల ప్రధాన రహదారి మునిగి పోవడంతో వాహనాలు రాక పోకలు ఇబ్బందితో పాటు దిగువ ప్రాంతంలోని గృహాలకు నీరు రావడం దృష్ట్యా నీటి మళ్లింపుకు తగిన చర్యలు చేపట్టడం జరిగింది.
ప్రధాన రహదారి, వరద నీరు వలన కలిగే సమస్యలను సంబంధిత అధికారులకి పలుమార్లు దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసిన కనీసం ప్రర్యవేక్షంచడానికి కూడా రాలేక అసహనం వ్యక్తం చేస్తున్నారు…
వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల డివిజన్ లోని పద్మనగర్ లో ఎగువ ప్రాంతం నుండి వస్తున్న నీటితో సిరిసిల్లకి వేళ్ళు రోడ్డు పూర్తిగా మునిగిపొయి కాలనీలోని గృహాలలోకి నీరు చేరి సమస్యగా మారడం గూర్చి మంత్రి గంగుల కమలాకర్ గారికి తెల్పడంతో సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీచేయగా అధికారులు స్పందించి ప్రస్తుత సమస్యకి పరిష్కారం దిశగా తాత్కాలిక చర్యలు చేపట్టడం జరిగింది…
కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనులు దక్కించుకొని కొన్ని నెలలు గడిచినా ఎలాంటి పనులు మొదలు చేయకపోవడంతో రోడ్డు ప్రధాన సమస్యగా మారడం వలన ప్రయాణికులు,స్థానికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది…
వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత శాశ్వత రోడ్డు,డ్రైనేజ్,మంచి నీటి పైప్ లైన్ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ కి నోటీసులు జారీచేయడం జరిగింది…
సమస్య చర్యల్లో భాగంగా నగర పాలక సంస్థ మెయర్ సునీల్ రావు గారు, జిల్లా కలెక్టర్ వి.కర్ణన్ గారు,నగర పాలక సంస్థ కమిషనర్ గరిమ అగ్రవల్ గారు మరియు మున్సిపల్,అర్ అండ్ బి, పోలీస్ అధికారులు పాల్గొనడం జరిగింది….

డివిజన్ లోని పద్మనగర్ లో మిషన్ భగీరథ మంచి నీటి పైప్ లైన్ లికేజ్ సమస్య వలన గత కొన్ని రోజులుగా డివిజన్ ప్రజలకి మంచి నీరు రాలేక ఇబ్బంది అవుతుందని మంచి నీటి సరఫరాకి సంభంధించిన అధికారులకి సమస్యను వివరించడం జరిగింది.. ఇందుకు గాను అధికారులు త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని తెల్పడం జరిగింది….